ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయం నమోదు చేయటంతో కూటమి శ్రేణులు విజయోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన వైసీపీ ఈసారి 11సీట్లకే పరిమితమయ్యి ఘోర పరాభవం మూట కట్టుకుంది.ఈ క్రమంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సిద్దమవుతున్నాడు. మొదట జూన్ 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించింది టీడీపీ.తాజాగా చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీని మార్చాలని నిర్ణయించారు చంద్రబాబు.
ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. 9న ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రధానిగా మోడీ మూడోసారి ప్రమాణం చేయనుండగా, సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించే అవకాశం ఉంది.