చంద్రయాన్ 3 లైవ్ లో ఇలా చూద్దాం..

చంద్రయాన్ 3 లైవ్ లో ఇలా చూద్దాం..

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం అద్భుతమైన వృద్దిని కనబరుస్తోంది. మరి కొన్ని గంటల్లో చంద్రునిపై సేఫ్ ల్యాండింగ్ కానున్న ఈ సమయంలో ఇస్రో ఓ కీలక ప్రకటన రిలీజ్ చేసింది. “MOX/ISTRAC వద్ద ల్యాండింగ్ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం ఆగస్టు 23, 2023న 17:20 గంటలకు ప్రారంభమవుతుంది అని వెల్లడించింది.

జూలై 14న శ్రీహరి కోటలోని షార్ ప్రయోగ వేదిక నుంచి రోదసీలోకి దూసుకువెళ్లిన చంద్రయాన్-3 మిషన్.. ల్యాండర్ మాడ్యూల్ (LM) కక్ష్యను సమర్థవంతంగా సర్దుబాటు చేసినట్లు ఇస్రో ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి మిషన్ విజయవంతంగా విడిపోయింది. ISRO ప్రకటన ప్రకారం, ల్యాండర్ కార్యాచరణకు ప్రణాళికాబద్ధమైన తేదీ, సమయం ఆగస్టు 23, 2023, భారత ప్రామాణికం ప్రకారం (IST) సాయంత్రం 6:04 గంటలకు కానుంది.

ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడవచ్చు?

చంద్రయాన్ లైవ్ టెలికాస్టింగ్ ను ISRO అధికారిక యూట్యూబ్ (YouTube) ఛానెల్ , ఇతర ప్లాట్‌ఫారమ్‌లలోనూ అందుబాటులో చూడవచ్చు. లూనార్ ల్యాండింగ్ ఈవెంట్‌కు సన్నాహకంగా, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) చంద్రయాన్-3 ల్యాండింగ్  ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేయడానికి ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు పిలుపునిచ్చింది.