శ్రీహరికోట: చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 22 మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2 నింగిలోకి ఎగరనుంది. రాకెట్ ను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రయాన్-2 ను శ్రీహరి కోట షార్ నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్3ఎం1 నింగిలోకి మోసుకెళ్ళనుంది. నేటి సాయంత్రం 6.43 గంటల నుంచి కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ -2 ప్రయోగం సక్సెస్ కాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రయోగాన్ని నిలిపి వేశారు శాస్త్రవేత్తలు. అయితే ఆ సాంకేతిక లోపాలను సరిదిద్దిన తర్వాత ఈ జీఎస్ఎల్‌వీ మార్క్ 3ఎం1 వాహక నౌకను సోమవారం నాడు ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేశారు.
