జనంలోకి చంద్రబాబు - వరుస సభలతో ఫుల్ బిజీ.. 

2024 సార్వత్రిక ఎన్నికలకు గాను సమయం దగ్గరపడుతోంది. ఏపీలో కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా ప్రకటించటంతో నేతలంతా ప్రచార బాట పడుతున్నారు.  ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 27 నుండి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ప్రజాగళం పేరుతో 27 నుండి 31వ తేదీ వరకు బహిరంగ సభలు, రోడ్ షోలతో ఫుల్ బిజీగా ఉండనున్నారు.

ప్రజాగళం పేరుతో జరగనున్న ఈ సభలకు గాను షెడ్యూల్ కూడా రెడీ చేసింది పార్టీ క్యాడర్. 27న పలమనేరు, నగిరి, నెల్లూరు రూరల్ లలో పర్యటనతో ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత 28వ తేదీ రాప్తాడు, సింగనమల, కదిరి లలో 29వ తేదీ శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30 మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరిపేట, శ్రీకాళహస్తిలలో 31వ తేదీ కావలి, మార్కాపురం, సంతనూతల పాడు, ఒంగోలు లలో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు.