ఏపీలో ఎన్డీయే కూటమి చరిత్ర తిరగరాసే విజయం దిశగా సాగుతోంది. 160సీట్లలో అధిక్యత సాధించిన కూటమి భారీ విజయం నమోదు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. జనసేన పోటీ చేసిన 21అసెంబ్లీ స్థానాల్లో 20చోట్ల ఆధిక్యత సాధించగా 2ఎంపీ స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. 2019లో భారీ విజయం సాధించిన వైసీపీకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కుతుందో లేదో అన్న పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల ఫలితాలకు ముందే డేట్ అనౌన్స్ చేసిన టీడీపీ ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో పడ్డారు. జూన్ 9న అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ శ్రేణులు ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.