వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయం: చంద్రబాబు

అనంతపురం జిల్లా శింగనమలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు.  శింగనమలలో ఈ సారి పసుపు జెండా ఎగరేయబోతున్నామని ఇక్కడకొచ్చిన జనం చూస్తే అర్ధమైపోతుంది.  వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి అధికారంలోకి వస్తుందన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నెమరు వేసుకుని ఓటు వేయాలని చంద్రబాబు ప్రజలను కోరారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వరుసగా పెంచుకుంటూ పోయారని విమర్శించారు. 

ఓటింగ్ రోజున గ్రామాలన్నీ ఏకం కావాలంటూ  మన భవిష్యత్తు కోసం అందరమూ పని చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకి ఓటు వేయించేలా ఒప్పించాలి. భవిష్యత్తుకు గ్యారెంటీ కల్పించాలి.  కేంద్రం లోని ఎన్డీఏ చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. సామాజిక న్యాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ప్రజలు తెలుసుకోవాలని చంద్రబాబు అన్నారు.. . దళితులకు న్యాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ ... టీడీపీ వెన్నెముక బీసీలు. . భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రోత్సహించే ఏకైక పార్టీ తెలుగుదేశం అంటే ప్రతి రంగమూ అభివృద్ధిలోకి రావాలంటే, లాభాల్లోకి రావాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు.