చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ - సీట్లు, మ్యానిఫెస్టోకు తుది మెరుగులు..

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీలో బీజేపీతో సీట్ల పంపకం, మేనిఫెస్టో గురించి కీలక చర్చ జరిగిందని తెలుస్తోంది. మానిఫెస్టోకు తుది మెరుగులు దిద్ది, బీజేపీ పెద్దల ముందు ఉంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చినప్పటికీ బీజేపీతో సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రానందునే తుది జాబితా ప్రకటనలో జాప్యం జరుగుతోంది. సుమారు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో ఎన్నికల ప్రచారం గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కూటమి తరఫున ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాలని బాబు, పవన్ నిర్ణయించారని సమాచారం. చంద్రబాబు ప్రపోజ్ చేస్తున్న ఎంపీ సీట్లలో పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం సుముఖంగా లేదని, ప్రస్తుతం కేటాయించిన అసెంబ్లీ సీట్లతో పాటు ఇంకో అసెంబ్లీ సీటు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తన్నట్లు సమాచారం.సీట్ల పంపకం విషయంలో ఒక క్లారిటీ రాగానే తుది జాబితాతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నాడట చంద్రబాబు. మరి, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కూడా కొలిక్కి రాని సీట్ల పంపకం ఎప్పటికి తెగుతుందో వేచి చూడాలి.

ALSO READ :- Keerthy Suresh, Suhas: సుహాస్ రేంజ్ పెరిగిపోయిందిగా.. ఏకంగా మహానటితో!