వారి నియామకాలు ఆపండి.. యూపీపీఎస్సీ ఛైర్మెన్ కు చంద్రబాబు లేఖ..

ఏపీలో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు అంతా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు పాలన విషయంలో ఎన్నికల సంఘానికి తరచూ లేఖలు రాస్తూ తన మార్క్ చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పలు అంశాలపై ఈసీకి లేఖలు రాసిన చంద్రబాబు ఇప్పుడు యుపీపీఎస్సి ఛైర్మెన్ డాక్టర్ మనోజ్ సోనీకి లేఖ రాశారు.

ఐఏఎస్‌కు రాష్ట్ర కేడర్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు నియమించొద్దని యూపీఎస్సీకి రాసిన లేఖలో కోరారు చంద్రబాబు. సదరు ఆఫీసర్ల ప్రమోషన్స్ సీఎం కార్యాలయానికే పరిమితం చేశారని పేర్కొన్నారు చంద్రబాబు.

ఇప్పుడు కూడా జాబితా తయారీలో పారదర్శకత లేదని, ఈ అంశాన్ని పునః పరిశీలించాలని యూపీఎస్సీ చైర్మన్‌ను కోరారు చంద్రబాబు.ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందన్న ధీమాలో చంద్రబాబు ఉన్నారు. విదేశీ పర్యటనను ముగించుకొని నాలుగైదు రోజుల్లో ఏపీకి వస్తారని, ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై పార్టీ శ్రేణులతో  సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది.