సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాస్క్ ధరించకుండా..మాస్క్ ధరించని వాళ్లకు జరిమానా విధిస్తామని ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జిలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని తరలిపోకుండా ఏం చేయాలో అన్ని చేశాం. ఇంకా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని సూచించారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీనే ఎక్కువ అప్పులు చేసింది. న్యాయమూర్తిపై దాడి చేసింది మంత్రి అనుచరులే. సీఎం అసమర్థత వల్ల కరోనా కేసులు పెరిగిపోతున్నాయి అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
