మేం గాడిదలు కాసేవాళ్లలా కనబడుతున్నామా : చంద్రబాబు

మేం గాడిదలు కాసేవాళ్లలా కనబడుతున్నామా : చంద్రబాబు

ఏపీ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ వాడీవేడీగా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం ఎలా వెళ్లారని టీడీపీ అడిగిన ప్రశ్నకు… జగన్ తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం అయ్యాక తాను ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లాననీ.. తాను వెళ్లకపోయినా తెలంగాణ వాళ్లు స్విచ్ నొక్కేవాళ్లని చెప్పారు. ఐతే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు గాడిదలు కాశారా అని ఎగతాళిగా మాట్లాడారు చేశారు జగన్. దీనికి ప్రతిపక్ష సభ్యులు తీవ్రమైన అభ్యంతరం తెలిపారు.

చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు. స్వరం పెంచుకుని.. గుడ్లురుమి చూస్తూ మాట్లాడారు. “ఏం తమాషాగా ఉందా. వీళ్లతో అవమానం పాలవ్వడానికి మేం వచ్చామా. వీళ్లతో మాటలు పడటానికి అసెంబ్లీకి వచ్చామా.. వయసును చూసి మాట్లాడే సభ్యత లేదు ముఖ్యమంత్రికి. ఒక సీఎం లెక్కలేని తనంతో మాట్లాడటం ఖండిస్తున్నా. ఈ ఎగతాళి ఎక్కడినుంచి వచ్చింది మీకు. మేం గాడిదలు కాసేవాళ్లలా కనిపిస్తున్నామా.. ఏమనుకుంటున్నారు మీరు.. ఇది పద్ధతాండి.. ఇలా అవమానిస్తారా మమ్మల్ని” అని చంద్రబాబు ఆవేశంగా అన్నారు.

“మా పాలసీలు మాకుంటాయి. హామీలపై టీడీపీ జగన్ ను ప్రశ్నిస్తుంటే భయపడిపోయి తన ఇంటిదగ్గర 144 సెక్షన్ పెట్టుకున్నాడు. మీరు మాట్లాడుతున్నారా మా గురించి. ” అని చంద్రబాబు ప్రశ్నించారు.