తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే.. చంద్రబాబు

ఏపీలో ఎన్నికల హడావిడి ముమ్మరం అయ్యింది. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ ఒకవైపు, ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, బహిరంగ సభలతో జనంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. పాలకొల్లులో ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ పైన తొలి సంతకం పీడతానని యువతకు హామీ ఇచ్చాడు.

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే సంవత్సరానికి 4లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్ళలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ పేరుతో జగన్ నిరుద్యోగ యువతను మోసం చేశాడని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా సమానంగా చేస్తానని అన్నారు చంద్రబాబు.