జగన్ ది నకిలీ ప్రేమ, నాది నిజమైన ప్రేమ... చంద్రబాబు

గోపులాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. డ్వాక్రా సంఘాలు తాన హయాంలోనే ప్రవేశపెట్టానని, ఎంతమంది సభ్యులు ఉంటె అంతమందికి పదివేల రూపాయలు ఇచ్చామని అన్నారు. జగన్ చరిత్ర తెలుసుకోవాలని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహాశక్తి పథకం కింద 18ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెల 1500 రూపాయలు ఇస్తామన్నారు బాబు.

తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఏడాదికి 15000రూపాయలు ఇస్తామని అన్నారు.మహిళల పట్ల జగన్ ది నకిలీ ప్రేమ అని, తనది నిజమైన ప్రేమ అని అన్నారు చంద్రబాబు. తన హాయంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమానంగా జరిగిందని, జగన్ వచ్చాక నాబివృద్ది శూన్యం అని, సంక్షేమంలో కూడా కోతలు విదిస్తున్నాడని మండిపడ్డారు చంద్రబాబు.