2024 ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీలో హడావిడి పీక్స్ కి చేరింది.ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా ముమ్మరం చేసిన నేపథ్యంలో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం హోరెత్తుతోంది. ఈ క్రమంలో అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్ కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు.అంబేద్కర్ జయంతి. రోజున ఇక్కడ మీటింగ్ పెట్టామని, రాజ్యాంగం మంచిదయన అమలు చేసేవారు మంచివారు కాకపోతే ప్రయోజనం లేదని అన్నారు.
జగన్ మళ్ళీ పై కి రాకుండా కాంక్రీట్ వేయాలని అన్నారు. జగన్ దళిత ద్రోహి అని, జగన్ ది చెత్త పాలనా అని మండి పడ్డారు చంద్రబాబు.ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని అన్నారు.జగన్ విలాస పురుషుడని, భారీ ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు. పేదలకు అగ్గిపెట్టె అంత ఇల్లు కట్టారని, కంపెనీలను తరిమేశారని అన్నారు. విశాఖ నుండి గంజాయి క్యాపిటల్ చేసాడుని అన్నారు చంద్రబాబు.