ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం కీలక దశకు చేరుకుంది. మొన్న అధికార వైసీపీ మేనిఫెస్టో ప్రకటించగా ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది. అధికార వైసీపీ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకే నగదు పెంచి, కొత్త పథకాలేవి లేకుండా మేనిఫెస్టో ప్రకటించగా కూటమి, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, ఇలా అందరినీ టార్గెట్ చేస్తూ జనరంజకంగా మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టో విడుదల సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కూటమి ప్రబుత్వం అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించారు చంద్రబాబు. ఒక పక్క వైసీపీ మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉన్నామని అంటుండగా, చంద్రబాబు అమరావతి అంశాన్ని ప్రస్తావించటం చర్చనీయాంశం అయ్యింది. మరి, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మూడు రాజధానులకు మద్దతిస్తారా లేక అమరావతికి మద్దతిస్తారా అన్నది వేచి చూడాలి.