ఏపీలో పొత్తు రాజకీయం క్లైమాక్స్ కి చేరింది. జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు బీజేపీతో పొత్తు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొంత కాలం కిందట బాబు, పవన్ వేర్వేరుగా చెరోసారి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసినప్పటికీ పొత్తుపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పొత్తు పై చర్చించి ఒక నిర్ణయం తీసుకునేందుకు ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాను కలిసి పొత్తును డిసైడ్ చేసేందుకు వెళ్లిన బాబు, పవన్ లకు రెండురోజులుగా షా అపాయింట్మేమెంట్ దొరకలేదు.
ఇప్పటికే జేపీ నడ్డాతో పొత్తు గురించి జరిపిన మంతనాలు ఫలించలేదు. సీట్ల విషయంలో చంద్రబాబు చెప్తున్న నంబర్ అమిత్ షా ఒప్పుకోవట్లేదని, అందుకే పొత్తు గురించి ఏ నిర్ణయానికి రాలేదని టాక్ వినిపిస్తోంది. అమిత్ షా ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ దొరకట్లేదని, బాబు, పవన్ లకు మూడోరోజు కూడా రాత్రి వరకూ పడిగాపులు తప్పవని టాక్ వినిపిస్తోంది.
ఢిల్లీలో బాబు, పవన్ పడిగాపులు కాస్తుండటం పట్ల వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. గతంలో మోడీని, అమిత్ షాను నోటికొచ్చిన మాటలు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని అంటున్నారు. మేము ఎన్నికలకు సిద్ధం అంటుంటే టీడీపీ, జనసేన మాత్రం అమిత్ షా ఇంటి ,ముందు సిద్ధం అంటున్నాయని మంత్రి అంబటి సెటైర్లు వేశారు.