ఓటుకు నోటు కేసులో చంద్రబాబే డీల్ చేసిండు

ఓటుకు నోటు కేసులో చంద్రబాబే డీల్ చేసిండు
ఓటుకు నోటు కేసులో జెరూసలెం మత్తయ్య స్టేట్ మెంట్ వైరల్ స్టీఫెన్ సన్ టీడీపీకి ఓటేస్తే రూ.5 కోట్లు, ఓటింగ్ కు దూరంగా ఉంటే రూ.3 కోట్లు ఇస్తమన్నరు ఒప్పించేందుకు తనకు 50 లక్షలు ఆఫర్ చేసిన్రని వెల్లడి  హైదరాబాద్‌‌, వెలుగు: ఓటుకు నోటు కేసుకు సంబంధించిన డీల్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడే చేసిండని.. ఆ కేసులో నాలుగో నిందితుడైన జెరూసలెం మత్తయ్య ఈడీకి చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ఓ స్టేట్ మెంట్ కాపీ వైరల్ అవుతోంది. అందులోని వివరాలివీ.. ‘‘నేను క్రిస్టియన్‌‌ ఆర్గనైజేషన్స్‌‌ నిర్వహిస్తుంటాను. నాకు స్టీఫెన్‌‌సన్‌‌ 30 ఏండ్లుగా ఫ్రెండ్‌‌. తెలంగాణ వచ్చినంక నామినేటెడ్‌‌ ఎమ్మెల్యే పోస్టు కోసం రికమండ్‌‌ చేయాలని స్టీఫెన్ సన్ నన్ను కోరాడు. అయితే టీఆర్ఎస్ పార్టీకి గానీ లేదా కవిత, కేటీఆర్, కేసీఆర్ దగ్గరి బంధువులకు గానీ ఫండ్ ఇవ్వాలని సూచించాను” అని మత్తయ్య తెలిపారు. మహానాడులో చంద్రబాబుతో భేటీ.. ‘‘20‌‌‌‌15  మేలో బషీర్‌‌‌‌బాగ్‌‌ ప్రెస్‌‌క్లబ్‌‌లో జరిగిన ఓ ప్రోగ్రామ్ లో  నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌‌ సన్‌‌, టీడీపీ యూత్ వింగ్ సెక్రటరీ జిమ్మిబాబు, నేను కలిశాం. అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌‌పై డిస్కషన్‌‌ జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు, రేవంత్‌‌రెడ్డిలను కలవడానికి హిమాయత్‌‌ సాగర్‌‌‌‌లో నిర్వహించే మహానాడుకు రావాలని జిమ్మిబాబు చెప్పాడు. నేను అక్కడికి వెళ్లగా.. చంద్రబాబు, రేవంత్ నాతో సీక్రెట్ గా మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ వేం నరేందర్‌‌‌‌ రెడ్డికి.. స్టీఫెన్‌‌ సన్‌‌తో క్రాస్‌‌ ఓటింగ్‌‌ చేయించాలని చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం స్టీఫెన్‌‌సన్‌‌ ను ఒప్పించాలన్నారు. నరేందర్‌‌‌‌రెడ్డికి ఓటేస్తే స్టీఫెన్‌‌సన్‌‌కి రూ.5 కోట్లు ఇస్తామని, ఓటింగ్‌‌కి దూరంగా ఉంటే రూ.3 కోట్లు ఇస్తామని ఆఫర్‌‌‌‌ చేశారు. ఈ డీల్ సెట్ చేస్తే నాకు రూ.50 లక్షలు ఇస్తామన్నారు” అని మత్తయ్య పేర్కొన్నారు. లోకేశ్ ని కలిస్తే ఏపీకి వెళ్లుమన్నరు… ‘‘ఆ తర్వాత రోజు నేను స్టీఫెన్‌‌సన్‌‌ను కలిశాను. ఆఫర్‌‌‌‌ గురించి చెప్పాను. అయితే ఆయన నా మాటలు నమ్మలేదు. ఈ క్రమంలో సెబాస్టియన్‌‌, రేవంత్‌‌తో కలిసి రెండుసార్లు స్టీఫెన్‌‌ సన్‌‌ ఇంటికి వెళ్లాను. చంద్రబాబు కూడా స్టీఫెన్‌‌సన్‌‌తో మాట్లాడారని సెబాస్టియన్‌‌ నాతో చెప్పాడు. స్టీఫెన్‌‌సన్‌‌కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్‌‌, మిగతావాళ్లు ఏసీబీకి చిక్కడంతో నా పేరు బయటకు వచ్చింది. నేను లోకేశ్ ను కలవగా.. నన్ను విజయవాడకు వెళ్లమని చెప్పారు” అని మత్తయ్య పేర్కొన్నారు. For More News.. మార్చి నుంచి కరోనాతో ఆగమాగం సాగు సాగుతలేదు.. నెమ్మదించిన వరి నాట్లు భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు