Champions Trophy 2025: వెనక్కి తగ్గిన పాకిస్థాన్..? హైబ్రిడ్‌ మోడ్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుందనే విషయంలో నేడో రేపో క్లారిటీ రానుంది. శుక్రవారం (నవంబర్ 29) ఐసీసీ నిర్వహించిన కీలక సమావేశంలో  ఐసీసీ తమ నిర్ణయాన్ని శనివారానికి వాయిదా వేసింది. వస్తున్న సమాచారం ప్రకారం శనివారం (నవంబర్ 31) జరిగిన మీటింగ్ లో పాకిస్థాన్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. హైబ్రిడ్ మోడ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని జరిపేందుకు అంగీకరించినట్టు తెలుస్తుంది.

ఈ మీటింగ్ లో ఫైనల్ మాత్రం లాహోర్‌లోనే నిర్వహించాలని పాక్‌ డిమాండ్‌ చేసినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా భవిష్యత్‌లో భారత్‌లో ఆడాల్సి వస్తే..తాము కూడా హైబ్రిడ్‌ మోడ్‌లోనే ఆడతామన్న పాక్‌ తెలియజేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఐసీసీ ఈ రోజు లేదా రేపు అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. 

ALSO READ | చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీపై నిర్ణయం నేటికి వాయిదా

శుక్రవారం జరిగిన ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అత్యవసర సమావేశంలోనూ ఈ టోర్నీ నిర్వహణపై  సభ్య దేశాలన్ని ఏకాభిప్రాయానికి వచ్చాయట. హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాయి. దీంతో పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ ఒప్పుకోకపోతే.. ఈ మెగా టోర్నీ పాక్ లేకుండానే జరగనుందని సమాచారం. 

శనివారం దీనిపై నిర్ణయానికి రాకపోతే మరికొన్ని రోజుల పాటు ఈ మీటింగ్‌‌‌‌ కొనసాగొచ్చు’ అని ఐసీసీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. గత ఐదు రోజుల నుంచి దుబాయ్‌‌‌‌లోనే మకాం వేసిన నఖ్వీ వ్యక్తిగతంగా హాజరుకాగా, బీసీసీఐ సెక్రటరీ జై షా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పాల్గొన్నారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా.. పాకిస్తాన్‌‌‌‌కు వెళ్లబోదన్న బీసీసీఐ వైఖరిని విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది.