ఢిల్లీ నుంచి దేశానికి రాజుకుంటున్న రైతుల నిరసన

ఢిల్లీ నుంచి దేశానికి రాజుకుంటున్న రైతుల నిరసన

రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు మూడో  రౌండ్ చర్చలు

పంజాబ్ లో రైల్ రోకో

ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఛలో ఢిల్లీ పాదయాత్ర ఈ రోజు (ఫిబ్రవరి 15)న  మూడో రోజుకు చేరుకుంది. బారికేట్లను తొలగించడానికి ప్రయత్నిస్తే పోలీసులు టియర్ గ్యాస్ వదులుతున్నారు. దీంతో నిరసనకారులు పోలీసులుపై  రాళ్ల దాడి చేశారు.  రబ్బరు బుల్లెట్స్, టియర్ గ్యాస్, రాళ్ల దాడి వల్ల గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలిస్తున్నారు. హర్యానాలోని జింద్ జిల్లాలో డేటా సింగ్‌వాలా, -ఖనౌరీ ప్రాంతాల్లో బుధవారం స్వల్ప ఉద్రిక్తతలు చేటు చేసుకున్నాయి. రైతులు తమ ట్రాక్టర్లతో శంభు వద్ద బారికేడ్లను ఢిల్లీ వైపు నెట్టడానికి ప్రయత్నించారు. గత రెండు రోజులతో పోల్చితే నిన్న కొంచెం తక్కువగా ఉద్యమం జరిగింది. రేపు (ఫిబ్రవరి 16)న గ్రామీణ భారత్ బంద్ దేశవ్యాప్తంగా చేపడతామని రైతు సంఘాలు చెప్పిన విషయం తెలిసిందే. రైతులు వారి డిమాండ్లను కేంద్రానికిి తెలియజేయడం కోసం ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా త్రీవతరం చేస్తున్నారు.

ఈ రోజు చండీగర్ లో ముగ్గురు కేంద్ర మంత్రులు మూడోసారి రైతు సంఘాలతో చర్చిస్తారు. రైతుల డిమాండ్లు పరిష్కరించి పాదయాత్రను విరమింపజేయడానికి సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ తోపాటు మరో ఇద్దరు మంత్రులు చర్చల్లో పాల్గొ్న్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రైతులకు సహాయంగా ఉంటామని అన్నారు. పరిస్థితులను ఉద్రక్తంగా మార్చకండని రైతులను కోరారు. కేంద్ర ప్రభుత్వ రైతులకు సహయం చేయడానకి నియమించింది.

ఢిల్లీలో ఈరోజు నుంచి CBSE ఎగ్జామ్స్ ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ అమలులో ఉండటంతో పరీక్షలు వాయిదా వేయాలని బోర్డును కోరారు. కానీ వాయిదా పడలేదు. పరీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైతుంది. ఎగ్జామ్ టైం కంటే ముందే బయల్దేరాలని అధికారులు సూచిస్తున్నారు.

పంజాబ్ లో రైల్ రోకో
భారతీయ కిసాన్ యూనియన్ రైతుల ఛలో ఢిల్లీకి మద్దతు తెలుపుతూ పంజాబ్ రాష్ట్రంలో ఈరోజు రైల్ రోకో'కి పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ రైల్వే ట్రాక్ లపై కుర్చొని నిరసన తెలుపనున్నారు.