మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : చల్లా వంశీచంద్​రెడ్డి

మరికల్​, వెలుగు:  మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎంపీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆ పార్టీ ఎంపీ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్  విందులో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్​కుమార్​రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబ్​నగర్​ పార్లమెంట్​ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్​కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఖాజా, మక్సూద్, మంజూర్, గౌస్, మౌలానా, కాంగ్రెస్​ నాయకులు వీరన్న, గొల్ల కృష్ణయ్య, వినీతమ్మ, సూర్యమోహన్​రెడ్డి, హరీశ్​ పాల్గొన్నారు.