ఎస్‌బీఐ చైర్మన్​గా పగ్గాలు చేపట్టిన గద్వాల్​ బిడ్డ

న్యూఢిల్లీ: గద్వాల్​కు ​చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి స్టేట్ బ్యాంక్ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ)  చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ పొజిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగిన దినేష్ ఖారా మంగళవారం పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కాకముందు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐలో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రీనివాసులు పనిచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన  వివిధ కమిటీల్లో మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. గతంలో  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిజిటల్ బ్యాంకింగ్ పోర్టుఫోలియోని చూసుకున్నారు. 

Also Read:-జహీరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ ​సిటీ

తన 30 ఏళ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాంకింగ్  డెవలప్డ్ మార్కెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగాల్లో  ఆయన పనిచేశారు. సాధారణంగా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతారు. సీనియారిటీ ఉన్నవారికి ప్రయారిటీ ఇస్తారు.  

రూ.7,500 కోట్ల సేకరణ..

బాసెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 కంప్లియెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైర్ 2 బాండ్లను అమ్మడం ద్వారా  రూ.7,500 కోట్లు సేకరించామని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించింది. ఈ బాండ్లపై  ఏడాదికి  7.42 శాతం వడ్డీ (కూపన్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఆఫర్ చేస్తోంది. మెచ్యూరిటీ 15 ఏళ్లు. 10 ఏళ్లు, ఆ  తర్వాత ప్రతీ ఏడాది యానివర్సరీ డేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాండ్లను తిరిగి కొనుగోలు చేసుకోవడానికి (కాల్ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐకి వీలుంటుంది. వడ్డీ రేట్లు పడిపోతే ఇష్యూయర్లు బాండ్ల కాల్ ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుతుంటారు.  బేస్ సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.5,000 కోట్లయితే రూ.8,800 కోట్లకు బిడ్స్ వచ్చాయి.