మార్కెట్ యార్డును సందర్శించిన చైర్ పర్సన్

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: పట్టణంలో శనివారం సాయంత్రం   వర్షం కురిసింది. దీంతో  హుటాహుటిన చైర్ పర్సన్ బెక్కరి అనిత రెడ్డి, సెక్రటరీ భాస్కర్, సిబ్బందితో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్ యార్డు ప్రాంగణమంతా పరిశీలించారు.  వర్షం పడడంతో వడ్లు, తదితర గింజలు తడవకుండా పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. మార్కెట్ లో ఎటువంటి నష్టం జరగలేదు.