వీగిపోయిన అవిశ్వాసం .. అమరచింత మున్సిపాలిటీలో కౌన్సిలర్ల గైర్హాజరు

వనపర్తి/ఆత్మకూరు, వెలుగు:  అమరచింత మున్సిపాలిటీలో చైర్​పర్సన్​ మంగమ్మ, వైస్​చైర్మన్​ గోపిపై పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.  పది మంది కౌన్సిలర్లున్న మున్సిపాలిటీలో ఆరుగురు  మార్చి 16న   కలెక్టర్​ తేజస్​నంద్​లాల్​ పవార్​ను కలిసి అవిశ్వాసం కోరుతూ వినతిపత్రం ఇ చ్చారు.

 దీంతో  ఆర్డీఓ పద్మావతి ఆధ్వర్యంలో గురువారం  అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి కేవలం నలుగురే కౌన్సిలర్లు వచ్చారు.  బీజేపీ కౌన్సిలర్ ఉషారాణి, సీపీఎం కౌన్సిలర్ మాధవి గైర్హాజరు  అయ్యారు. దీంతో కోరం లేకపోవడంతో నిబంధనల ప్రకారం అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు.