మార్కెట్ లో సౌలతులు కల్పించాలి : శ్రీనివాస్ గౌడ్

వనపర్తి, వెలుగు: రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్  ప్రభుత్వం  కట్టుబడి ఉందని వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి మార్కెట్ యార్డ్ లో చైర్మన్​​శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ఆదాయ, వ్యయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

గేట్ ఎంట్రీని పారదర్శకంగా నిర్వహించాలని, నిత్యం యార్డుకు వచ్చే ధాన్యం వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. విశ్రాంతి గదులను రైతులు వినియోగించుకునేలా చూడాలన్నారు. వైస్​ చైర్మన్​ రామకృష్ణారెడ్డి, మున్సిపల్  చైర్మన్  పుట్టపాకల మహేశ్  పాల్గొన్నారు.