ఐసీసీ హెడ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో జై షా

దుబాయ్‌‌‌‌‌‌‌‌: ఐసీసీ కొత్త చైర్మన్‌‌‌‌‌‌‌‌ జై షా గురువారం దుబాయ్‌‌‌‌‌‌‌‌లోని హెడ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. రాబోయే రోజుల్లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ను మరింత ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ‘ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఐసీసీలోని నా సహోద్యోగులతో కలిసి పని చేసేందుకు అవకాశం వచ్చింది. క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ను మరింత ఎత్తులకు తీసుకెళ్లేందుకు అవసరమైన రోడ్‌‌‌‌‌‌‌‌ మ్యాప్‌‌‌‌‌‌‌‌ను మేం రూపొందిస్తాం. 

ఆటను ముందుకు నడిపించేందుకు తెర వెనుక అవిశ్రాంతంగా, అంకితభావంతో పని చేస్తున్న నా టీమ్‌‌‌‌‌‌‌‌ను కలవడం గర్వంగా ఉంది’ అని షా పేర్కొన్నారు. ఐసీసీ బోర్డు తరఫున తాను జై షాకు స్వాగతం పలుకుతున్నానని డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌ ఖవాజా అన్నారు. షా ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ ఐసీసీని మరింత మెరుగ్గా ముందుకెళ్లేందుకు దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.