పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్

పొలంలో మహిళా రైతుపై దాడి చేసి ఓ దుండగుడు సినీ పక్కీలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధి హమీదుల్లా నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఏప్రిల్ 22వ తేదీ  సోమవారం మధ్యాహ్నం మంజుల అనే రైతు తన పొలం దగ్గర పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా కారులో వచ్చిన దుండగుడు కాసేపు మంజులతో మాట్లాడుతూ.. ఆమె దృష్టి మరల్చి అనంతరం చేతులకు గ్లోవ్స్ వేసుకొని పక్క ప్రణాళికతో మహిళపై దాడి చేశారు. మెడలో ఉన్న పుస్తెలతాడు లాగి అక్కడి నుంచి కారులో పరారయ్యాడు. 

బాధితురాలు కారును వెంబడించే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో షిఫ్ట్  కారు చివరి 4 నెంబర్లు 2951 మహిళ గుర్తు పెట్టుకొని భర్తకు సమాచారం ఇచ్చింది. ఈ ఘటనపై భర్త శంషాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శంషాబాద్ రూరల్ పోలీసులు.. సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడి కారును గుర్తించినట్లుగా సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.