రాజేంద్రనగర్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ స్నాచింగ్

రంగారెడ్డి: హైదరాబాద్ నగరంలో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. అదను చూసి ఒంటరి మహిళలే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళవారం (జూలై 16, 2024) రాజేంద్రనగర్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. బస్టాప్ నిల్చున్న ఓ మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ లాక్కొని పారిపోయారు. మహిళను కిందపడేసి ఈడ్చుకుంటూ కొంత దూరం లాక్కెళ్లి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును దొంగించారు. మహిళ తేరుకొని కేకలు వేసినా ఫలితంగా లేకుండా పోయింది.. స్నాచర్పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లి మాయ మయ్యాడు. 

రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ ఫిల్డర్ బెడ్ వద్ద ఉన్న బస్ స్టాప్ లో ప్రభుత్వ ఆస్పత్రిల్లో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లారు స్నాచర్. మహిళను కిందపడేసి కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో స్పల్పంగా గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదులో రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ శరా మామూలే.. గతంలో కూడా రెండు చైన్ స్నాచింగ్ లు ఈ ప్రాంతంలో జరిగాయి. మంగళవారం మూడో ఘటన జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.