చైన్​ స్నాచింగ్​ దొంగలు అరెస్ట్

  • 10 తులాల గోల్డ్​ రికవరీ

వికారాబాద్​, వెలుగు: ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్​ చేస్తూ.. వరుస చైన్​ స్నాచింగ్​లకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్​ చేసినట్లు ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్​ లో రెండు రోజుల్లోనే 3చైన్​ స్నాచింగ్​ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వారిని పట్టుకునేందుకు పోలీసులతో పాటు సీసీఎస్​ ఇన్స్​పెక్టర్​లు బలవంతయ్య, అన్వర్​పాషా ఆధ్వర్యంలో రెండు స్పెషల్​ టీంలను ఏర్పాటు చేసి, దొంగలు ఎండీ జావిద్​, ఓ మైనర్​ను కర్నాటకలోని హుంనాబాద్​లో అరెస్ట్​ చేసినట్లు ఎస్పీ తెలిపారు. జావిద్​పై హైదరాబాద్​, సైబరాబాద్​, రాచకొడ, రంగారెడ్డి, వికారాబాద్​, అదిలాబాద్​, నిజాంబాద్​, మహబూబ్​నగర్​ మెదక్​ జిల్లాల్లో మొత్తం 150 పైగా కేసులు ఉన్నాయని తెలిపారు. వీరి నుంచి 10తులాల బంగారాన్ని రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. 

షాద్​నగర్​లో ఒక దొంగ నుంచి 15 తులాల బంగారం ...

షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సోమవారం బంగారం దొంగతనానికి పాల్పడిన దొంగను మంగళవారం షాద్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.. సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం వుండే శివప్రసాద్ నాయక్ లేబర్ పని చేసుకునేవాడు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విజయనగర్ కాలనీలో ఒక ఇంటికి తాళం వేసి ఉండటంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి 18.1 తులాల బంగారం చోరీకి పాల్పడ్డాడు. ఇంటి యజమాని శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని, శివప్రసాద్ ను అరెస్ట్​ చేశారు. అతని నుంచి 15 తులాల బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఐ వెంకటేశ్వర్లు,పోలీసు సిబ్బంది కరుణాకర్, మోహన్ జాకీర్, రఫీ తదితరులున్నారు.