ఘట్కేసర్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. తల్లికూతుళ్ల మెడ నుంచి గోల్డ్ చైన్లు చోరీ

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. అన్నోజిగూడలో తల్లికూతుళ్ల మెడ నుంచి గోల్డ్ చైన్లు లాక్కెళ్లారు. జీడిమెట్ల నుంచి ఘట్కేసర్ వైపు స్కూటీ పై వెళ్తున్న తల్లికూతుళ్లు సునీత, శ్రీజ మెడలోంచి చైన్లు లాక్కెళ్లారు. ఈ క్రమంలోనే ఇద్దరూ స్కూటీపై నుంచి కిందపడ్డారు. వారికి స్వల్పగాయాలయ్యాయి. పోచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.