వరద సాయం విడుదల చేసిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే..

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన పలు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయం విడుదల చేసింది.ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 14రాష్ట్రాలకు వరద సాయం నిధులు విడుదల చేసింది కేంద్రం. 14రాష్ట్రాలకు గాను రూ. 5వేల 858కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రకు రూ. 1492 కోట్లు విడుదల చేసింది కేంద్రం.

కేంద్రం విడుదల చేసిన వరద సాయం నిధుల్లో అత్యధికంగా మహారాష్ట్రకు రూ. 1492కోట్లు విడుదల చేయగా.. ఏపీకి రూ. 1036కోట్లు, తెలంగాణకు రూ. 416. 80కోట్లు విడుదల చేసింది కేంద్రం.సెప్టెంబర్ నెలలో కూడా పలు రాష్ట్రాలకు వరద సాయం కింద రూ.3, 448కోట్లు నిధులు విడుదల చేసింది కేంద్రం.

ALSO READ | హైడ్రా హైడ్రోజన్ బాంబు లాంటిది..పేదోడి జోలికొస్తే ఊరుకోం: ఎమ్మెల్యే కూనంనేని