వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పర్మిట్లను మార్చి 31వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా వెహికల్ రిజిస్ట్రేషన్ల గడువు పెంచాలంటూ పలువురు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటికే కేంద్రం రిజిస్ట్రేషన్లను మార్చి 30,2020, జూన్ 9 2020, ఆగస్ట్ 24, 2020 ఇలా మూడుసార్లు గడువు తేదీలను మార్చింది. చివరిగా వాహనాల రిజిస్ట్రేషన్లను డిసెంబర్ 31, 2020 నాటికి పూర్తి చేసుకోవాలని చెప్పింది.
తాజాగా కొత్త కరోనా వైరస్ కారణంగా మార్చి 31,2021మారుస్తూ కేంద్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్ హైవే అథారిటీ నిర్ణయం తీసుకుంది. కాగా వాహనాల రిజిస్ట్రేషన్ల వ్యాలిడిటీ ఫిబ్రవరి1,2020 నాటికి ముగిసినా కేంద్రం నిర్ణయంతో.. ఆ రిజిస్ట్రేషన్ల వ్యాలిడిటీ 2021 మార్చి 31 వరకు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.
కరోనా వ్యాప్తి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ముగిసినా 2021 మార్చి 31 వరకు చెల్లుబాటు అయ్యేలా వ్యవహరించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కేంద్రం
