కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA)3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్‌ కీలకం నిర్ణయం తీసుకుంది. దీంతో​ మొత్తం DA 31 శాతానికి చేరుకుంది.  కరోనా కారణంగా జనవరి 2020 నుంచి జూన్‌ 2021 వరకు డీఏ పెంపుదల అంశం వాయిదా పడింది. ఈ ఏడాది జూలై నెలలో కేంద్ర ప్రభుత్వ సంస్ధలో పని చేస్తున్న ఉద్యోగులకు ,పెన్షనర్లకు చెల్లించే డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) లను 17శాతం నుంచి  28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

కొత్తగా పెరిగిన DA,DR 2021 జూలై 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్రం తెలిపింది.  కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ పెంపుతో కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,488.70కోట్ల వరకు అదనపు భారం పడనుంది.