బట్టలు మార్చుకోవడానికి అల్లు అర్జున్‎కు టైమ్ ఇచ్చాం: పోలీసుల వివరణ

హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్‎లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‎ను పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 13) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం బన్నీని ఆయన ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్‎తో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ పట్ల పోలీసు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారనేది  నిజం కాదని అన్నారు. బట్టలు మార్చుకునేందుకు పోలీసులు బన్నీకి సమాచారం ఇచ్చారు.. ఆయన బెడ్ రూమ్‎కు వెళ్లి  డ్రెస్ మార్చుకుని వచ్చారని తెలిపారు. ఈ సమయంలో పోలీసులు బయట వెయిట్ చేశారు. పోలీసులు బన్నీ బెడ్ రూమ్‎లోకి వెళ్లారనేది తప్పుడు ప్రచారమన్నారు. బెడ్ రూమ్ నుండి బయటకు రాగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఏ పోలీసు సిబ్బంది కూడా అతనితో బలవంతంగా లేదా దురుసుగా ప్రవర్తించలేదు. అతను బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు.  ఏ పోలీసు సిబ్బంది కూడా అతనితో బలవంతంగా లేదా దురుసుగా ప్రవర్తించలేదు. అరెస్ట్ సమయంలో అతని కుటుంబం, భార్యతో మాట్లాడేందుకు కూడా టైమ్ ఇచ్చారు.. తర్వాత అల్లు అర్జున్ స్వయంగా వచ్చి పోలీసు వాహనంలో కూర్చున్నాడని వివరణ ఇచ్చారు. 

ALSO READ | పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్.. : అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోని టీషర్ట్ పై క్యాప్షన్ ఇదే..

పుష్ప-2 విడుదలకు సంబంధించి బందోబస్తును కోరుతూ సంధ్యా సినీ ఎంటర్‌ప్రైజ్ పంపిన లేఖపైన డీసీపీ క్లారిటీ ఇచ్చారు. బందోబస్తు కోసం సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఏ పోలీస్ అధికారిని కలవలేదు. కేవలం ఇన్‌వర్డ్ విభాగంలో లేఖ మాత్రం ఇచ్చి వెళ్లారని వివరించారు. అయినప్పటికీ థియేటర్ వెలుపల క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అల్లు అర్జున్ థియేటర్‎కు వచ్చే వరకు పరిస్థితి బానే ఉందని.. ఆయన వచ్చి తన కారు సన్ రూఫ్ నుంచి అభివాదం చేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. 

దీంతో థియేటర్ దగ్గర పరిస్థితి అదుపు తప్పింది. ఇదే సమయంలో బన్నీ ప్రైవేట్ సెక్యూరిటీ తన వాహనానికి దారి కల్పించడానికి ప్రజలను పక్కకు తోయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు వెంటిలేటర్‎పై చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అల్లు అర్జున్ చర్యల వల్లే ఈ ఘటన జరిగినట్లు నిర్ధారణ కావడంతోనే అతడిపై కేసు నమోదు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.