అగ్నిపథ్ నిరసనలతో కేంద్రం కీలక నిర్ణయం

అగ్నిపథ్ నిరసనలతో  కేంద్రం కీలక నిర్ణయం

అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.  అగ్నిపథ్ లో భాగంగా ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన అగ్ని వీరులకు  సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వడ్ పోలీస్ ఫోర్స్ , అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్ల కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అంతేకాకుండా  గరిష్ఠ వయోపరిమితిని సడలించింది. ఈ రెండు బలగాల్లో చేరేందుకు నిరుద్యోగులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీంతో అగ్నివీరులకు ఎంపికయ్యే ఫస్ట్ బ్యాచ్కు మొత్తం ఐదేళ్ల సడలింపు లభించనుంది. ఇప్పటికే ఈ ఏడాది అగ్ని పథ్ కింద జరగే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించింది. కేంద్ర సాయుధ బలగాల్లో అంటే BSF, CRPF, ITBP, SSB‌,CISF తో పాటు NSG, SPG విభాగాల్లో  ప్రస్తుతం 73,219 పోస్టులున్నాయి. వీటితో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీసు బలగాల్లో మరో 18,124 ఖాళీలున్నాయి. తాజాగా వయో పరిమితి సడలించడంతో..ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 28 ఏళ్లకు పెరిగింది.