ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలపై కేంద్రం నిషేధం విధించింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ల ప్రకటనలకు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ జరుగుతుందని..నిషేధిత కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలు ప్రజలను పక్కదారి పట్టించేలా ఉన్నాయని..ఇవి వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019కి విరుద్ధమని తెలిపింది. ఇటీవల ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో ఇటువంటి ప్రకటనలు ఎక్కవవుతున్న తరుణంలో కేంద్రం ఈ అడ్వైజరీని జారీ చేసింది. ప్రజాప్రయోజనలు దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేసినట్లు తెలిపింది. ఆన్లైన్ గేమింగ్ యొక్క ప్రకటనలపై అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అందరు కట్టుబడి ఉండాలని సూచించింది.
