ఐదో అంతస్తు పైనుంచి పడి కార్మికుడు మృతి

జీడిమెట్ల, వెలుగు:  పేట్​బషీరాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నిర్మాణంలో ఉన్న  ఐదో అంతస్తు భవనం పైనుంచి పడి ఓ సెంట్రిక్​ కార్మికుడు చనిపోయాడు.   మహరాష్ట్రకు  చెందిన మహేశ్​ దేవరావ్​ షిండే(33) ఉపాధి కోసం వచ్చి కాప్రాలో ఉంటూ పేట్​ బషీరాబాద్​ లో   సెంట్రింగ్​ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.  కాంట్రాక్టర్​, బిల్డింగ్​ ఓనర్​ చెప్పడంతో  సోమవారం ఉదయం  మహేశ్​  దేవరావ్​ ఐదో అంతస్తుపై సెంట్రింగ్​ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో తోటికార్మికులు అతన్ని  స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.