స్కాలర్​షిప్​ నిధులను భారీగా పెంచిన కేంద్రం.. 4 కోట్ల మందికి ప్రయోజనం

స్కాలర్​షిప్​ నిధులను భారీగా పెంచిన కేంద్రం.. 4 కోట్ల మందికి ప్రయోజనం
స్కాలర్​షిప్​ల కోసం రూ.59 వేల కోట్లు ఎస్సీ స్టూడెంట్లకు ఇవ్వనున్న కేంద్రం 4 కోట్ల మందికి లాభం డీటీహెచ్ సెక్టార్​లో ఇక 100 % ఎఫ్​డీఐలు కేంద్ర కేబినెట్​ నిర్ణయం న్యూఢిల్లీ: ఎస్సీ స్టూడెంట్లకు ఇచ్చే పోస్ట్​ మెట్రిక్​ స్కాలర్​షిప్​లను కేంద్రం భారీగా పెంచింది. వచ్చే ఐదేళ్లలో దాదాపు 4 కోట్ల మందికి పైగా ఎస్సీ స్టూడెంట్లకు రూ. 59 వేల కోట్ల స్కాలర్​షిప్​లు అందించాలని నిర్ణయించింది. ఈ మొత్తంలో 60 శాతం(35,534 కోట్లు) కేంద్ర ప్రభుత్వ వాటా కాగా మిగతా మొత్తం ఆయా రాష్ట్రాలు సమకూర్చాల్సి ఉంటుంది. ఈమేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్​ భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. స్కాలర్​షిప్​లను పెంచడం ద్వారా ఎస్సీ కమ్యూనిటీలోని నిరుపేద కుటుంబాలకు చెందిన స్టూడెంట్లలో పై చదువులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందని కేంద్ర కేబినెట్​ ఓ స్టేట్​మెంట్​లో పేర్కొంది. వెనకబడిన తరగతులకు చెందిన స్టూడెంట్లకు కూడా నాణ్యమైన విద్య అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపింది. ఈ స్కీంలో భాగంగా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన పదో తరగతి పాసైన స్టూడెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తామని, వారు కోరుకున్న పై చదువులకు ఆర్థిక సాయం అందిస్తామని వివరించింది. డీటీహెచ్​ లైసెన్స్​ 20 ఏండ్ల దాకా.. డైరెక్ట్​ టు హోమ్​ టెలివిజన్(డీటీహెచ్) గైడ్​లైన్స్​ను కూడా కేబినెట్​ సవరించింది. ఇప్పటి వరకు 10 ఏండ్లకు ఇస్తున్న లైసెన్స్​ విధానాన్ని మార్చి 20 ఏండ్ల వరకు ఒకేసారి కేటాయించేలా చేసిన సవరణలకు ఆమోదం తెలిపింది. లైసెన్స్​ ఫీజును ఏడాదికి ఓసారి కాకుండా మూడు నెలలకు ఓసారి చొప్పున వసూలు చేసేలా మార్పులు చేశామని కేంద్ర మంత్రి ప్రకాశ్​​ జవదేకర్​ చెప్పారు. అదేవిధంగా డీటీహెచ్​ బ్రాడ్​కాస్టింగ్​ సర్వీస్​ సెక్టార్​లో ఇకపై వందకు వంద శాతం ఎఫ్​డీఐలను అనుమతించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ సెక్టార్​లో ఎఫ్​డీఐలను ప్రభుత్వం కేవలం 49 శాతానికే పరిమితం చేసిందని, తాజాగా దీనిని వంద శాతానికి  పెంచామని జవదేకర్​ వివరించారు. For More News.. కరోనా టీకా కొవిషీల్డ్ ​వచ్చేవారమే! కరోనా వ్యాక్సిన్.. ఇంట్రెస్ట్ చూపించని జనం