EPFOపై వడ్డీ రేట్లు తగ్గించిన కేంద్రం

EPFOపై వడ్డీ రేట్లు తగ్గించిన కేంద్రం

PF ఖాతాదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది.. గత ఆర్థిక సంవత్సరం డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించింది. ఇంతకు ముందు ఉన్న 8.5 శాతం ఉన్న వడ్డీ రేటును 8.1 శాతానికి కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫండ్ పై వడ్డీ రేటును స్థిరంగానే ఉంచిన కేంద్రం.. దానికన్నా ముందు EPFO వడ్డీ రేటును తగ్గించింది. 45 ఏండ్లల్లో ఇదే తక్కువ వడ్డీ రేటని అధికారులు తెలిపారు. వడ్డీరేట్లు తగ్గించడం వల్ల 6 కోట్ల మందిపై ప్రభావం పడనుంది. 

మరిన్ని వార్తల కోసం...

ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ అంబానీ