ప్రభుత్వ పాఠశాలలో ఊడిపడిన పెచ్చులు

  •     తప్పిన ప్రమాదం  

లింగాల, వెలుగు : లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తరగతిలో పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. అయిదో తరగతిలో 26 మంది విద్యార్థులు చదువుతున్నారు. శుక్రవారం ఇంటర్వెల్ సమయంలో పై పెచ్చులు ఊడిపడటంతో వెంటనే విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. తరగతి గదిలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.