ఢిల్లీ ఎన్నికలు.. ఫిబ్రవరి 5న పోలింగ్.. 8 కౌంటింగ్

ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 23 తో ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ రాజీవ్ కుమార్. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఫిబ్రవరి 23తో ముగియనుంది.  అధికార ఆప్ (AAP) , కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయి. ఢిల్లీలో మొత్తం ఓటర్ల సంఖ్య1 కోటి 55 లక్షలు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

 

ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

  • నోటిఫికేషన్ తేది: జనవరి 10
  • నామినేషన్లకు చివరి తేది: జనవరి 17
  • నామినేషన్ల  పరిశీలన: జనవరి18
  • నామినేషన్ల ఉపసంహరణ: జనవరి 20
  • పోలింగ్ తేది: ఫిబ్రవరి 5
  • ఫలితాలు: ఫిబ్రవరి 8

ఢిల్లీ ఓటర్ల వివరాలు:

  • ఢిల్లీలో ఓటర్లు మొత్తం : 1.55 కోట్లు
  •  పురుషులు : 83.49 లక్షలు
  •  మహిళలు: 71.74 లక్షలు 
  • యువ ఓటర్లు ( 20–29 సంవత్సరాల మధ్య) : 25.89 లక్షలు
  • తొలిసారి ఓటర్లు (18–19 సంవత్సరాల) : 2.08 లక్షలు
  • పీడబ్ల్యూడీ ఓటర్లు : 79,436 
  • వందేళ్లు దాటిన ఓటర్లు : 830
  •  85+ వయసు దాటిన ఓటర్లు : 1.09 లక్షలు
  • ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు : 1,261

ఢిల్లీ పోలింగ్ స్టేషన్లు, ఇతర వివరాలు:

  • ఢిల్లీలో పోలింగ్‌ స్టేషన్లు : 13,033
  •  ప్రాంతాలు : 2,697
  • ఢిల్లీలో 100% పట్టణ ప్రాంత పోలింగ్‌ స్టేషన్లు
  • ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌కు సగటు ఓటర్లు : 1191
  • వెబ్‌ కాస్టింగ్‌ : 100%
  • పీడబ్ల్యూడీ సిబ్బంది నిర్వహించే పోలింగ్‌ స్టేషన్లు : 70
  • మహిళా సిబ్బంది నిర్వహించే పోలింగ్‌ స్టేషన్లు :70
  •  మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లు : 210


ఢిల్లీలో దేశం నుంచి అన్ని ప్రాంతాల వారు ఉంటారని, ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాడానికి సర్వం సిద్ధం చేసినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. గతేడాది ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.  దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య  99 కోట్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అందులో మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లు దాటినట్లు తెలిపారు. 

ALSO READ | సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..

ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని, ఎలాంటి అవకతకవలకు తావులేదని సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు. ఈవీఎంల రిగ్గింగ్, ట్యాంపరింగ్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. వీవీ ప్యాట్ ల లెక్కింపులో ఇప్పటివరక ఎక్కడా తేడా రాలేదని తెలిపారు. పోలింగ్ ఆలస్యమైనా సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.