నాసిరకం వస్తువులు అమ్మినందుకు గాను ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ (CCPA) నోటీసులను జారీ చేసింది. BIS మార్కుకు లోబడి లేని ప్రెజర్ కుక్కర్ లను అమ్మినందుకు నోటీసులిచ్చింది. పేటీఎం మాల్, స్నాప్ డీల్, షాప్ క్లూస్ తదితర ఈ కామర్స్ సంస్థలకూ నోటీసులు అందాయి. ఈ నెల 18నే నోటీసులిచ్చినట్టు CCPA తెలిపింది.
నాణ్యత నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా చర్యలను తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రెజర్ కుక్కర్లతో పాటు 13 రకాల ఉత్పత్తుల అమ్మకాలపై CCPA దృష్టి సారించింది. హెల్మెట్ల క్వాలిటీనీ పరిశీలించనుంది.
