మే 4 నుంచి సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ పరీక్షలు

మే 4 నుంచి సీబీఎస్ఈ టెన్త్, ఇంటర్ పరీక్షలు
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖా మంత్రి రమేష్ పోక్రియల్ న్యూఢిల్లీ: సీబీఎస్ఈ బోర్డ్ పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియల్ ప్రకటించారు. మే 4 నుంచి ప్రారంభం కానున్న సీబీఎస్ఈ 10వ తరగతి,  ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ను ఆయన విడుదల చేశారు. జూన్ 10 న మొత్తం పరీక్షల ప్రక్రియ ముగుస్తుంది.  జూలై 15 న పరీక్ష ఫలితాలు ప్రకటించడం జరుగుతుందని ఆయన వివరించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ట్విట్టర్ లైవ్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి రమేష్ పొక్రియాల్ విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు.. అన్నివర్గాల సూచనలను పరిగణలోకి తీసుకునొ బోర్డు పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. కొత్త సంవత్సరం స్వాగత వేళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపధ్యంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణ ప్రక్రియ మూడు నెలలు ఆలస్యం అయింది. మామూలుగా అయితే జనవరిలో ప్రాక్టికల్ పరీక్షలు మొదలవుతాయి. మార్చిలో మెయిన్ పరీక్షలుంటాయి. అయితే ఈసారి మేలో ప్రారంభమై జూన్ లో ముగియనున్నాయి.