పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలు రాసే 10, 12 తరగతుల విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. సిలబస్‌లో 15శాతం వరకు తగ్గిస్తూ ప్రకటించింది. ఇండోర్‌లో జరిగిన ప్రిన్సిపాల్ సమ్మిట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. చదువుల్లో ప్రాక్టికల్ నాల్జెడ్ పెంచి, బట్టీ విధానాన్ని  తగ్గించడానికి పిల్లలపై బారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. సిలబస్ తగ్గింపు సీబీఎస్సీ విద్యార్థుల అభివృద్ధి, విద్యా ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ఉందని CBSE భోపాల్ రీజనల్ ఆఫీసర్ వికాస్ కుమార్ అగర్వాల్ అన్నారు. 2025 ఎగ్జామ్ లో వీరు సిలబస్ మార్పు అమలవుతుంది.

అలాగే ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు మార్కులు పెరిగాయి. ఫైనల్ గ్రేడ్‌లో ఇప్పడు 40శాతం వెయిటేజీని ఉంటుంది. మిగిలిని 60 శాతం మార్కులకు ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అది కూడా 15 శాతం సిలబస్ లేకుండా.. డిజిటల్ అసెస్‌మెంట్, ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఫార్మాట్. CBSE ఇంగ్లీష్ లిటరేచర్ మరియు సోషల్ సైన్స్ వంటి కొన్ని సబ్జెక్టుల కోసం ఓపెన్-బుక్ ఎగ్జామినేషన్ ఫార్మాట్‌ను పరిచయం చేయాలని యోచిస్తోంది. అంతే కాదు 2026 నాటికి టూ-టర్మ్ ఎగ్జామ్ స్ట్రక్చర్‌గా మార్చాలని విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. అంటే ప్రస్తుతం CBSE విద్యార్థులకు అకాడమిక్ ఈయర్ కు ఒక ఎగ్జామ్ ఉంది. 2026 తర్వాత పిల్లలపై ఒత్తిడి పడకుండా సంవత్సరానికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నారు విద్యాశాఖ అధికారులు.