సుశాంత్ ది హత్యనా..ఆత్మహత్యనా?

సుశాంత్ ది హత్యనా..ఆత్మహత్యనా?
బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం గురించి సీబీఐ నోరు విప్పాలని మహరాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ డిమాండ్ చేశారు. సుశాంత్ చనిపోయి ఐదునెలలు పూర్తవుతుంది. ఆయనది ఆత్మహత్యనా లేదంటే ఎవరైనా హత్య చేశారా అన్న విషయాన్ని సీబీఐ అధికారులు చెప్పాలన్నారు. త్వరగా ఈ కేసు విచారణ పూర్తిచేసి వివరణ ఇవ్వాలని కోరారు. కాగా సుశాంత్ జూన్ 14 ముంబైలో తన నివాసంలో మరణించారు. సుశాంత్ మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇన్వెస్టిగేషన్ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంపై సుప్రీం కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. సుశాంత్ డెత్ మిస్టరీపై సీబీఐ అధికారులు విచారణ చేపట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ కొనసాగుతుండగా.., మహరాష్ట్ర హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిగ్గా మారాయి. మహరాష్ట్ర ప్రజలతో పాటు ప్రతీ ఒక్కరూ సుశాంత్ మరణంపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికైనా సీబీఐ అధికారులు సుశాంత్ మరణం ఎందుకు జరిగిందో చెప్పాలని అన్నారు.   .