కార్పొరేట్ ​పవర్​ లిమిటెడ్​ కంపెనీపై సీబీఐ కేసు

కార్పొరేట్ ​పవర్​ లిమిటెడ్​ కంపెనీపై సీబీఐ కేసు

న్యూఢిల్లీ: బ్యాంకు మోసం కేసులో అభిజిత్​ గ్రూప్​ ప్రమోట్​ చేసిన కార్పొరేట్ ​పవర్​ లిమిటెడ్​ కంపెనీపై సీబీఐ ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. ఈ కంపెనీ, దాని ప్రమోటర్లు రూ. 4 వేల కోట్ల మేర బ్యాంకు మోసాలకు పాల్పడ్డారనేది ఆరోపణ. గురువారం నాడు 16 ప్రాంతాలలో  కంపెనీ ఆఫీసులను సీబీఐ సెర్చ్​ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కోల్​కత్తాకు చెందిన ఈ స్పెషల్​ పర్పస్​ వెహికల్​ కంపెనీ  కార్పొరేట్​ పవర్​ లిమిటెడ్​ను అభిజిత్​ గ్రూప్​ నెలకొల్పింది. జార్ఖండ్​లో పవర్​ ప్లాంట్​ ఏర్పాటు చేయాలనేది కంపెనీ ప్రతిపాదన. యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ఆఫీసర్లు చెప్పారు. 20 బ్యాంకుల కన్సార్టియమ్​ను కంపెనీ ప్రమోటర్లు మోసగించినట్లు పేర్కొన్నారు. అభిజిత్​ గ్రూప్​కంపెనీలలోని చాలా మంది డైరెక్టర్లు ఇప్పటికే ఇతర సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు.

కోల్​ స్కామ్​ కేసులలోనూ వారు నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు. ఆ కేసులలో ఛార్జ్​షీట్లు కూడా ఫైలయ్యాయని అన్నారు. కార్పొరేట్​ పవర్​ లిమిటెడ్​ను మొదట్లో చితాపుర్​ కోల్​ అండ్​ పవర్​ లిమిటెడ్​ పేరుతో ఏర్పాటు చేశారు. జార్ఖండ్​లో రూ. 2,900 కోట్ల ఖర్చుతో 540 మెగావాట్ల పవర్​ ప్లాంట్​ను ఈ కంపెనీ నెలకొల్పవలసి ఉందని సీబీఐ ఆఫీసర్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం అప్పులు తీసుకోవడానికి 2009–2013 మధ్య కాలంలో ప్రాజెక్టు ఖర్చును పెంచేసి ప్రాజెక్టు రిపోర్టులను బ్యాంకులకు సబ్మిట్​ చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులను షెల్​ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు కూడా చెబుతోంది. మనోజ్​ జైశ్వాల్​, అభిషేక్ ​జైశ్వాల్​, అభిజిత్​ జైశ్వాల్​లు ఈ కంపెనీ ప్రమోటర్లు.