గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఉదయం ఎనిమిది గంటలకు బెంగుళూరు నుంచి రాయపాటి ఇంటికి వచ్చిన సీబీఐ బృందం.. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ విషయంపై, కెనరా బ్యాంక్ కేసు విషయం లో రాయపాటి ఇంట్లో సోదాలు నిర్వహించింది. గుంటూరు లోని రాయపాటి నివాసం తో పాటు, హైదరాబాద్ లోని గెస్ట్ హౌస్ లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. నివాసం లో డాక్యుమెంట్లు, బ్యాంక్ నోటీసులు పరిశీలించిన సీబీఐ అధికారులు.. రాయపాటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. తనిఖీల్లో సీబీఐ తో పాటు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. రాయపాటి, కుటుంబ సభ్యులు సీబీఐ వారికి సహకరించినట్టు తెలిపారు. కెనరా బ్యాంక్ – ట్రాన్స్ ట్రాయ్ మధ్య ఉన్న ఆర్ధిక వివాదం పైనే విచారణ జరిగినట్లు వారు తెలిపారు. కాగా గుంటూరు లోని రాయపాటి నివాసం లో సీబీఐ సోదాలు ముగిసినట్టు సమాచారం.
