ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరొకరిని సీబీఐ అరెస్ట్ చేసింది. చరణ్‌ ప్రీత్ సింగ్ అనే  వ్యక్తిని సీబీఐ  మే 16 మంగళవారం రోజున అదుపులోకి తీసుకుంది.  అతన్ని  సీబీఐ  ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా అతనికి  కోర్టు రెండు రోజుల కస్టడీ విధించింది. 

లిక్కర్ స్కాంలో చరణ్‌ప్రీత్ సింగ్ పాత్ర ఉన్నట్లు విచారణలో సిబీఐ గుర్తించింది. ఇదే కేసులో మే 15 సోమవారం రోజున  అరెస్టై,  సీబీఐ కస్టడీలో ఉన్న అరవింద్‌ కుమార్‌ సింగ్‌తో పాటుగా చరణ్‌ ను  సీబీఐ  విచారించే  అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ పలుమార్లు విచారించింది. ఆమె  ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంది. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా సీబీఐ గతంలో నోటీసులు జారీ చేసింది.  ఆయనను కూడా ఈ కేసులో సీబీఐ ప్రశ్నించింది.