బీజేపీలో జగన్ కోవర్టులున్నారా... రఘురామ మాటల్లో నిజమెంత..!

బీజేపీలో జగన్ కోవర్టులున్నారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ నుండి ఎంపీ టికెట్ ఆశించిన ఆయనకు టికెట్ దక్కని నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ కోవర్టులుగా ఉన్న కొంతమంది వల్ల తనకు టికెట్ దక్కలేదని ఆరోపణలు చేశారు రఘురామ. సోము వీర్రాజు లాంటి వారిని టార్గెట్ చేస్తూ రఘురామ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోంది.

 

తాజాగా రఘురామ వ్యాఖ్యలను సమర్థిస్తూ సంచలన ట్వీట్ చేశాడు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరావు బీజేపీలో కొందరు నేతలు టీడీపీని, అందులోని పెద్దలను విమర్శిస్తూనే ఉంటారని, అలాగే బీజేపీలో చాలా మంది జగన్ కోవర్టులు ఉన్నది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు. బీజేపీలో ఉన్న జగన్ కోవర్టులు చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతూనే ఉన్నారని అన్నారు. కానీ ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తులోకి వెళ్లాయి, కానీ జగన్ తో ఇంత లోతైన బంధాలు తెంచుకుని పార్టీ కోసం ఆయా నేతలు పనిచేస్తారా అంటూ సంచలన ట్వీట్ చేశారు నాగేశ్వరరావు. సిబిఐ మాజీ డైరెక్టర్ చేసిన ఈ ట్వీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.