న్యూఢిల్లీ: క్యాష్ఫర్ క్వైరీ వివాదంలో టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రాపై సీబీఐ ఎంక్వైరీ ప్రారంభించింది. లోక్‌పాల్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ మొదలైంది. ఎంక్వైరీ తర్వాత సీబీఐ ఇచ్చే రిపోర్ట్ అధారంగా ఎంపీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.
అయితే, ఈ ప్రాథమిక విచారణలో అరెస్టు చేయడం, సోదాలు చేయడం వంటివి ఉండవు. సమాచార సేకరణ, అవసరమైన డాక్యుమెంట్ల పరిశీలన, నిందితులను ప్రశ్నించడం వంటివి మాత్రం ఉంటాయి. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు బిజినెస్‌మన్ దర్శన్ హీరానందానీ నుంచి ఎంపీ మొయిత్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు లాయర్ జై అనంత్ దేహద్రాయ్ సీబీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే!
