కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు ఎంపీ కార్తి అనుచరులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. చెన్నైలో కార్తి సన్నిహితుడు ఎన్ భాస్కర్ రామన్ ను అరెస్ట్ చేశారు. విదేశీ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయంటూ కార్తి పై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. 11 ఏళ్ల కిందట యూపీఏ హయాంలో చిదంబరం కేంద్రహోంమంత్రిగా ఉన్న టైంలో కార్తి లంచం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు. పవర్ కంపెనీ పనుల కోసం భారత్ వచ్చిన 250 మంది చైనా పౌరులకు వీసాలు ఇచ్చేందుకు 50 లక్షలు లంచం తీసుకున్నారన్నారు. కార్తి, ఆయన సన్నిహితుడు భాస్కర్ రామన్ సహా పలువురి నివాసాలు, అధికారిక కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కర్ణాటక, ఒడిశా, శివగంగైలో సోదాలు జరిగాయి. కార్తి, భాస్కర్ రామన్, తలవండీ, పవర్ ప్రాజెక్టు ప్రతినిధి వికాస్ మఖరియా, ముంబైకి చెందిన బెల్ టూల్స్ పేర్లను కూడా కేసులో చేర్చారు. భాస్కర్ రామన్ నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వార్తల కోసం
