ఉప్పునుంతలలో కుంగిపోయిన దుందుభి నది కాజ్​వే

  • నిలిచిపోయిన రాకపోకలు

ఉప్పునుంతల, వెలుగు: ఉప్పునుంతల, -వంగూర్  మండలాల సరిహద్దు ప్రాంతమైన మొలగర-ఉల్పర మధ్య దుందుభి నదిపై ఉన్న కాజ్​వే భారీ వర్షాల కారణంగా కుంగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో వచ్చిన భారీ వరదలకు కాజ్​ వే డ్యామేజ్  అయ్యింది. అప్పుడు మొరం పోసి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూశారు.

మళ్లీ వరద ఉధృతి పెరగడంతో శుక్రవారం వారం రాత్రి కాజేవే పూర్తిగా కుంగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉండడంతో స్థానికులు డిండి, చింతపల్లి మీదుగా వెళ్లాలని అలర్ట్  చేశారు. రూ.30 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఏడాది గడవక ముందే రోడ్డు డ్యామేజ్  కావడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైలెవల్  బ్రిడ్జి నిర్మాణంతోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.